Home » » ‘బాడీగార్డ్’ కు తెలంగాణ సెగ

‘బాడీగార్డ్’ కు తెలంగాణ సెగ

Sunday, September 4, 2011 | 0 comments


 వెంకటేష్, త్రిష జంటగా నటిస్తున్న ‘బాడీగార్డ్’ సినిమా షూటింగ్‌ను శంషాబాద్‌ మండలం అమ్మపల్లిగుడిలో తెలంగాణ మూవీ అసోసియేషన్ తో పాటు  తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.  తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే వారి సినిమా షూటింగ్‌లను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే ముందస్తు సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
కొద్దిరోజుల క్రితం మహేష్ బాబు ‘దూకుడు’ షూటింగ్ ను వికారాబాద్ లో తెలంగాణ వాదులు అడ్డుకుని చిత్రం యూనిట్ పై దాడి చేశారు. గత సంవత్సరం ‘ఖలేజా’ షూటింగ్ సెట్టింగ్ ను ధ్వంసం చేశారు. తెలంగాణ వాదుల హెచ్చరికల నేపథ్యంలో షూటింగ్ లకు ఇబ్బందులు తప్పడం లేదు.

Share this article :

0 comments:

Post a Comment

 
| |
Copyright © 2011. Sarath The king - All Rights Reserved
Template Designed by Sarath